నేనావేశంతో కొండ కొన చేరి
చూశాను జలకన్యను నేను గుడ్లురుమి
పగా ద్వేషముతో జ్వలించే గుండెతో
చల్లార్చ వచ్చితిని నేనచ్చటికి
భాధతో బరువెక్కిన హృదయంతో
చూసాను ఆ ప్రవాహమును అగమ్యగోచరముతో
కదులుతున్న జల కన్య కనుకోసన నవ్వింది
అదురుతున్న గుండె లయ డమరుకమై మ్రోగింది
No comments:
Post a Comment