Friday, 14 June 2013

Hi-Tech Schools

ఊసరవెల్లి చేష్టలంట 
సంవత్సరానికో రకం  డ్రెస్ అంట 

డిజిటల్ స్కూల్స్  అంట 
గంపడేమో  బుక్సంట 

Inflation అంతా ఇక్కడేనంట 
Concession మాత్రం అడగొద్దంట 

Hi-tech City లోన 
Schools  టెక్కులే వేరంట  

Qualified teachers యే కరువంట
 ఆయాలే  బరువంట

Library యే లేదంట  
Toilet లే గబ్బంట 

Ground ఏమో లేదంట 
Video-games ఆడిపిస్తారంట

Physical fitness అవసరం లేదంట 
Mentally ఎదగాలంట 

Hi-tech City లోన 
Schools  టెక్కులే వేరంట  

Dress వారే ఇస్తారంట 
ధర ఏమో Double అంట 

Books వారే ఇస్తారంట 
అడిగినంత ఇవ్వాలంట 

Diary cost వేరంట 
Tie,Belt,shoes గట్రా additional అంట 

Hi-tech City లోన 
Schools  టెక్కులే వేరంట 

మనిషిగా ఎదగానీయక 
మర-మనిషి తో పోటీకి  పోగ 

Emotions కి విలువనీయక 
Logic లతో అన్ని కొలువగ 

ఉన్న Society కి దూరం చేసి 
Global citizen  ని చేయ 

Hi-tech City లోన 
Schools  టెక్కులే వేరయ