కుళ్ళి పోయిన సమాజానికి
నే సాయ పడలేను
అని
ఎదురు తిరిగిన ప్రకృతికి
ఏమని సమాధానము చెప్పను
నీ ధాటికి ఎగిరి పోయిన
ఈ గుడిసెలను చూపనా
నీటిలో కొట్టుకు పోయిన
ఆ జీవులను చూపనా
అధికారమధంతో అందలెక్కి కూర్చున్న
ప్రభుత్వాలకేమి తెలుసు
ఈ జీవుల బ్రతుకులు
స్వార్ధంతో సరసం
ప్రకృతితో చెలగాటం
నియమాల ఉల్లంగనమ్
30 రూపాయల తో సామాన్యుడి జీవనం
ప్రాజెక్టు లంటూ ఇబ్బడి-ముబ్బడి లెక్కల సారం
తప్పుడు లెక్కల పారాయణం
అధికారం కోసం అందెలు ఎగబాకి
ఆస్తి అంతస్తులను పెంచి ఆత్మ గౌరవం విడనాడి
మానవతా విలువలను మట్టి కరిపించిన వారిని
ఏ మాదుకోమని కోరను
కరునించవా ఈ పేద ప్రజలను చూసి
ఆపుము ఈ ప్రళయతాన్డవము
చేయుము ఈ జీవులకు సాయము