గల్లీ గల్లీల్లో సిల్లీ సిల్లీ వార్తలు సేకరించి
లొల్లి లొల్లి చేసే టీవీ చానల్లు
కల్ల -బొల్లి మాటలతో ఏమ్మర్చే నేతలని
కుళ్ళి కుళ్ళి దిగజారిన రాజకీయ వ్యవస్థని
కుల్ల బొడిచే దమ్మున్నా
దలారీ తనమెందుకు ?
సొల్లు గాళ్ళ సోంబేరి గాళ్ళ ఇంటర్వ్యూ లు మాని
స్వంతంగా ఎదిగిన,వ్యాపార సామ్రాజ్యాన్నేస్తాపించిన
నలుగురికీ ఉపయోగపడిన వ్యక్తులనైనగూర్చి
స్ఫూర్తి దాయక ఏమైనా చేయన్డిక
సమయానికి తగు విలువ
వ్యాపార ప్రకటనలతో నువు కొలవగ
వ్యాపార ప్రకటనలతో నువు కొలవగ
సరదాకని టీవీ చూసి చూసి
సన్నాసులె అవుతున్నారిక్కడ
సన్నాసులె అవుతున్నారిక్కడ