Friday, 9 November 2012

రెక్కలున్న హృదయం నాది

రెక్కలున్న హృదయం నాది 
ఎవరి తలపుల్లో  నను బందించారె  
అద్ధమంటి  మనసు నాది 
ఎవరి చిత్రం అందు గీసారె 

చిత్రమైన  బంధంతోటి 
గమత్తుగా నను కట్టేసారె 
ఎత్తుగా మీ గుండెల్లోనా 
ఎందుకూ  నను ఎదిగించారె

పచ్చనీ  ఆ మైదానంలోనా 
అడుగులే  నే మరిచానే 
గోప్పనైన  మీ గుండెల్లోన 
మత్తుగా మరి నిదురించానే 

తట్టి లేపవె  మానసా  నీవు
 చాయనున్నది  చాల ప్రయాణం 
ప్రేమనిండిన  మీ హృదయాలతోటి 
చేర్చండి నన్ను నా గమ్యం 

చిగురించాలి  ప్రేమ బీజాన్ని 
చుట్టూ పక్కల హ్రుదయాల్లోనా 
స్థాపించాలి  ప్రేమ రాజ్యాన్ని 
మీ అండతో నే సాధించనా 

మీ అండతో నే సాధించనా .....
మీ అండతో నే సాధించనా