Wednesday, 26 June 2013

స్త్రీ

దేశంలో పూజింప బడుతుంది ఓ స్త్రీ 
దేశంలో అధికారం చేలాయిన్స్తుంది  ఓ స్త్రీ 
దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంది ఓ స్త్రీ 
దేశానికి గౌరవం తెచ్చి పెడుతుంది ఓ స్త్రీ 

దేశంలో పిల్లలను పోషిస్తుంది ఓ స్త్రీ 
దేశంలో సంస్కారమ్  నేర్పిస్తుంది ఓ స్త్రీ 
దేశానికే ఆలోచన రేకేత్తిస్తున్నదో   స్త్రీ 
దేశంలో  దురాచారాన్ని  తరిమేస్తున్నదో   స్త్రీ 

దేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలుతున్నదో   స్త్రీ 
దేశంలో ఇంటి దీపాల వాలే వేలుగుతున్నదో స్త్రీ 
దేశంలో ఇంటిల్లపాదిని ఆదుకుంటున్నదో స్త్రీ 
దేశంలో గౌరవమ్ పొందుతున్నదో  స్త్రీ 

అదే ఈ  దేశంలో 
అవమానం కి గురి అవుతున్నదో స్త్రీ 

ఆడపిల్ల పుట్టుకే అయిష్టం  కొందరికి 
పుట్టినా పెంపకం అనవసరం మరికొందరికి 
మానవతా విలువలను మట్టి కరిపిస్తునే ఉన్నా 
మనకేం పట్టనట్టు ఉంటున్నాం ఈ  దేశంలో 

తప్పు ఎక్కడో తెలుసుకో లేకనా 
ఆ తప్పు మనలో,
 ఏ మూలో  ఉందనా 
సమాజంలో ఎక్కడైతె  మనకెందుకు లే అనా 
అదే సమాజంలొ  మనం కూడ  ఉన్నామని మరిచామా 

ఆత్మ శోదన అవసరం అందరికి 
ఇంటి-బయట ఓ కన్నేసి ఉండాలి ఎప్పటికీ