దేశంలో పూజింప బడుతుంది ఓ స్త్రీ
దేశంలో అధికారం చేలాయిన్స్తుంది ఓ స్త్రీ
దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంది ఓ స్త్రీ
దేశానికి గౌరవం తెచ్చి పెడుతుంది ఓ స్త్రీ
దేశంలో పిల్లలను పోషిస్తుంది ఓ స్త్రీ
దేశంలో సంస్కారమ్ నేర్పిస్తుంది ఓ స్త్రీ
దేశానికే ఆలోచన రేకేత్తిస్తున్నదో స్త్రీ
దేశంలో దురాచారాన్ని తరిమేస్తున్నదో స్త్రీ
దేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలుతున్నదో స్త్రీ
దేశంలో ఇంటి దీపాల వాలే వేలుగుతున్నదో స్త్రీ
దేశంలో ఇంటిల్లపాదిని ఆదుకుంటున్నదో స్త్రీ
దేశంలో గౌరవమ్ పొందుతున్నదో స్త్రీ
అదే ఈ దేశంలో
అవమానం కి గురి అవుతున్నదో స్త్రీ
ఆడపిల్ల పుట్టుకే అయిష్టం కొందరికి
పుట్టినా పెంపకం అనవసరం మరికొందరికి
మానవతా విలువలను మట్టి కరిపిస్తునే ఉన్నా
మనకేం పట్టనట్టు ఉంటున్నాం ఈ దేశంలో
తప్పు ఎక్కడో తెలుసుకో లేకనా
ఆ తప్పు మనలో,
ఏ మూలో ఉందనా
సమాజంలో ఎక్కడైతె మనకెందుకు లే అనా
అదే సమాజంలొ మనం కూడ ఉన్నామని మరిచామా
ఆత్మ శోదన అవసరం అందరికి
ఇంటి-బయట ఓ కన్నేసి ఉండాలి ఎప్పటికీ
No comments:
Post a Comment