Thursday, 8 November 2012

నేటి మనిషి

తెలుసు తెలుసనుకుంటూనే 
   తెలిసి తప్పులు చేయు 
బతక నేర్చినానని  చెప్పి 
   బరి తెగించి  ప్రవర్తించు 

మనసుకు గొలుసులు కట్టి 
   మదిరంలో  ముంచు 
మహామహుల  మాటలనే 
   తాకట్టు ఎట్టు 

మనిషిననే  విషయాన్నే 
   మరుగున అంటిపెట్టు 

వంచన కుతంత్రాలతో 
   కాసులనే కూడగట్టు 
కన్నవారితో  పాటు 
   బoధు  ప్రీతినే వీడగోట్టు 

బ్రమలో పడి  మనిషి 
   బ్రతుకునే ఈడ్చు 

No comments:

Post a Comment