Friday, 23 November 2012

మరో రోజు


ఆకాశంలో చుక్కలు మరుగైన వేళ
చంద్రుడు సూర్యున్ని చూసి తప్పుకున్న వేళ 
పక్షుల రాగాలకు పరవశించి తలలూపే చెట్ల సమక్షంలో 

మరో రోజు మరో రోజు 
తల్లుక్కుమన్నది 

కూటి కోసం గూడు దాటే జీవాలే కాక 
ఆరగించి విశ్రమించే మరెన్నో జీవాలు ;
గర్భం నుండి వేరుపడ్డ పసిగుడ్దల కేరింతలతో 
అంతమించిన జీవానికి ఆత్మీయుల శోకంతో 

మరో రోజు మరో రోజు 
అస్తమించినది 

No comments:

Post a Comment