ఎపుడు వచ్చును ప్రళయం
ఎపుడు వచ్చును విద్వంసం
సాంకేతిక పరిజ్ఞానంతొ కనుగొను మనం
భూమాత ఎదను తవ్వి
అపార సమపదనే తోడుకొని
అభివృద్ధి పేరు చెప్పి
సమతల బావమే విడనాడి
చేసిన పనులకు మనది బాద్యత కాదా
అంతరిక్షములకు ఎగబాకి
అన్నిటిని గమనించి చూసి
అర్డంబు చేసుకొని
బాధ్యతగా మెదలడం అవసరం లేదా
సాంకేతిక అబివ్రుద్దిని తోడి
సామాన్య పరిజ్ఞానము వీడనాడి
మానవతా విలువలు మాని
సంపదతో కొలచి వలచి
ప్రక్రుతికే పరీక్షలు పెడితే
ప్రకృతి వికృతి కాదా
అవసరాన్ని వాడుకొని
వ్యాపార మూల సూత్రం విడనాడి
రాబందుల వాలే ప్రవర్తించు వారు
మనలో ఒకరే అని మరిచారా
సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న మన అభివృద్ధి అహంకారం
మనకేం కాలేదులే అనుకున్న మానవుడి విచక్షణ
జ్ఞానం
పటాపంచలు చేసే ప్రకృతి విలయ తాండవం
తనదాకా వస్తే కానీ అర్ధం కాదు కదా
అర్ధం చేసుకు బ్రతికితే అది మన సంస్కారం
Wonderful
ReplyDelete