Monday, 16 September 2013

ఎవ్వడెవ్వడు ఎక్కడైనను

ఎవ్వడెవ్వడు  ఎక్కడైనను
ప్రేమ ఉన్మాదిగా మారుతున్నాడో

ఎవ్వడెవ్వడు  ఎక్కడైనను
ఆడదని అలుసుగ  పలుకుతున్నాడో

ఎవ్వడెవ్వడు  ఎక్కడైనను
మగువ ఒంటరని మాటు వేస్తు ఉన్నాడో

ఎవ్వడెవ్వడు  ఎక్కడైనను
అబల ను అంగడి సరుకుగా  చూస్తూ ఉన్నాడో

ఎవ్వడెవ్వడు ఎక్కడైనను
వనితని తన  కామానికి బలి చేస్తూ ఉన్నాడో

ఎవ్వడెవ్వడు ఎక్కడైనను
తల్లి చెల్లిని మరచి పోతున్నాడో

ఎవ్వడెవ్వడు ఎక్కడైనను
అమ్మాయిలను  ఆటబొమ్మలుగ  మార్చుతున్నాడో

ఎవ్వడెవ్వడు ఎక్కడైనను
వావి వరసలు మరుస్తూ ఉన్నాడో

ఎవ్వడైనను ఎంతటి వాడి నైనను
కండకావారముని  గుండె బెజారిల్లేట్టుగ

శిక్షించి  శిక్షించి

ఏకి పారెయ్ ఈ వ్యవస్థ నుండి 

No comments:

Post a Comment