Monday, 30 September 2013

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం కదిలింది

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం కదిలింది
ప్రశ్నించే నేర్పు ,పరిగెత్తే ఓర్పు పరాక్రమమే  అది చూపింది

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం కదిలింది
సంపన్నుడి సంపద ,అధికారుని అర్హత నిగ్గ దీసి అది అడిగింది

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం కదిలింది
దోపిడీ తత్వాన్ని ,దళారీ వ్యవస్థలను అది నిల దీసింది

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం కదిలింది
ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకుల వెన్నులోంచి చలి పుట్టించింది

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం కదిలింది
బాబాల  ముసుగులొ బట్టేబాస్  గాళ్ళను బట్టలూడదీసి కొట్టింది

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం కదిలింది
ప్రజా ధనాన్ని ప్రజా సంక్షేమం  పేరుతో మింగిన వాణ్ని కక్కిన్చిందీ

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం కదిలింది
తప్పు దోవ చేరు తప్పు చేయు వాని నిబ్బరాన్ని గుద్ది వమ్ము చేసింది

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం కదిలింది
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం కదిలింది

Monday, 16 September 2013

ఎవ్వడెవ్వడు ఎక్కడైనను

ఎవ్వడెవ్వడు  ఎక్కడైనను
ప్రేమ ఉన్మాదిగా మారుతున్నాడో

ఎవ్వడెవ్వడు  ఎక్కడైనను
ఆడదని అలుసుగ  పలుకుతున్నాడో

ఎవ్వడెవ్వడు  ఎక్కడైనను
మగువ ఒంటరని మాటు వేస్తు ఉన్నాడో

ఎవ్వడెవ్వడు  ఎక్కడైనను
అబల ను అంగడి సరుకుగా  చూస్తూ ఉన్నాడో

ఎవ్వడెవ్వడు ఎక్కడైనను
వనితని తన  కామానికి బలి చేస్తూ ఉన్నాడో

ఎవ్వడెవ్వడు ఎక్కడైనను
తల్లి చెల్లిని మరచి పోతున్నాడో

ఎవ్వడెవ్వడు ఎక్కడైనను
అమ్మాయిలను  ఆటబొమ్మలుగ  మార్చుతున్నాడో

ఎవ్వడెవ్వడు ఎక్కడైనను
వావి వరసలు మరుస్తూ ఉన్నాడో

ఎవ్వడైనను ఎంతటి వాడి నైనను
కండకావారముని  గుండె బెజారిల్లేట్టుగ

శిక్షించి  శిక్షించి

ఏకి పారెయ్ ఈ వ్యవస్థ నుండి