Wednesday, 26 June 2013

స్త్రీ

దేశంలో పూజింప బడుతుంది ఓ స్త్రీ 
దేశంలో అధికారం చేలాయిన్స్తుంది  ఓ స్త్రీ 
దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంది ఓ స్త్రీ 
దేశానికి గౌరవం తెచ్చి పెడుతుంది ఓ స్త్రీ 

దేశంలో పిల్లలను పోషిస్తుంది ఓ స్త్రీ 
దేశంలో సంస్కారమ్  నేర్పిస్తుంది ఓ స్త్రీ 
దేశానికే ఆలోచన రేకేత్తిస్తున్నదో   స్త్రీ 
దేశంలో  దురాచారాన్ని  తరిమేస్తున్నదో   స్త్రీ 

దేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలుతున్నదో   స్త్రీ 
దేశంలో ఇంటి దీపాల వాలే వేలుగుతున్నదో స్త్రీ 
దేశంలో ఇంటిల్లపాదిని ఆదుకుంటున్నదో స్త్రీ 
దేశంలో గౌరవమ్ పొందుతున్నదో  స్త్రీ 

అదే ఈ  దేశంలో 
అవమానం కి గురి అవుతున్నదో స్త్రీ 

ఆడపిల్ల పుట్టుకే అయిష్టం  కొందరికి 
పుట్టినా పెంపకం అనవసరం మరికొందరికి 
మానవతా విలువలను మట్టి కరిపిస్తునే ఉన్నా 
మనకేం పట్టనట్టు ఉంటున్నాం ఈ  దేశంలో 

తప్పు ఎక్కడో తెలుసుకో లేకనా 
ఆ తప్పు మనలో,
 ఏ మూలో  ఉందనా 
సమాజంలో ఎక్కడైతె  మనకెందుకు లే అనా 
అదే సమాజంలొ  మనం కూడ  ఉన్నామని మరిచామా 

ఆత్మ శోదన అవసరం అందరికి 
ఇంటి-బయట ఓ కన్నేసి ఉండాలి ఎప్పటికీ 


Friday, 21 June 2013

కుళ్ళి పోయిన సమాజానికి నే సాయ పడలేను..........

కుళ్ళి పోయిన సమాజానికి
 నే సాయ పడలేను
 అని 
ఎదురు తిరిగిన ప్రకృతికి 
ఏమని సమాధానము చెప్పను 

నీ ధాటికి ఎగిరి పోయిన 
గుడిసెలను చూపనా 
నీటిలో కొట్టుకు పోయిన 
జీవులను చూపనా 

అధికారమధంతో అందలెక్కి కూర్చున్న 
ప్రభుత్వాలకేమి తెలుసు 
జీవుల బ్రతుకులు 

స్వార్ధంతో సరసం 
ప్రకృతితో చెలగాటం
నియమాల ఉల్లంగనమ్

30 రూపాయల తో సామాన్యుడి జీవనం
ప్రాజెక్టు లంటూ ఇబ్బడి-ముబ్బడి లెక్కల సారం  
తప్పుడు లెక్కల పారాయణం

అధికారం కోసం అందెలు ఎగబాకి 
ఆస్తి అంతస్తులను పెంచి ఆత్మ గౌరవం విడనాడి 
మానవతా విలువలను మట్టి కరిపించిన వారిని
ఏ మాదుకోమని కోరను

కరునించవా పేద ప్రజలను చూసి 
ఆపుము ప్రయతాన్డవము 
చేయుము  జీవులకు సాయము 


Friday, 14 June 2013

Hi-Tech Schools

ఊసరవెల్లి చేష్టలంట 
సంవత్సరానికో రకం  డ్రెస్ అంట 

డిజిటల్ స్కూల్స్  అంట 
గంపడేమో  బుక్సంట 

Inflation అంతా ఇక్కడేనంట 
Concession మాత్రం అడగొద్దంట 

Hi-tech City లోన 
Schools  టెక్కులే వేరంట  

Qualified teachers యే కరువంట
 ఆయాలే  బరువంట

Library యే లేదంట  
Toilet లే గబ్బంట 

Ground ఏమో లేదంట 
Video-games ఆడిపిస్తారంట

Physical fitness అవసరం లేదంట 
Mentally ఎదగాలంట 

Hi-tech City లోన 
Schools  టెక్కులే వేరంట  

Dress వారే ఇస్తారంట 
ధర ఏమో Double అంట 

Books వారే ఇస్తారంట 
అడిగినంత ఇవ్వాలంట 

Diary cost వేరంట 
Tie,Belt,shoes గట్రా additional అంట 

Hi-tech City లోన 
Schools  టెక్కులే వేరంట 

మనిషిగా ఎదగానీయక 
మర-మనిషి తో పోటీకి  పోగ 

Emotions కి విలువనీయక 
Logic లతో అన్ని కొలువగ 

ఉన్న Society కి దూరం చేసి 
Global citizen  ని చేయ 

Hi-tech City లోన 
Schools  టెక్కులే వేరయ





Wednesday, 5 June 2013

మ్యాచ్ ఫిక్సింగు

కాన్పుకోసమై హాస్పిటల్కి మేమెల్లితె
 ఆపరేషన్ అని చెప్పి ఆదుర్డానే  పెంచి 
టెస్టింగ్ నుండి మందుల బిల్లింగ్ వరకు డాక్టర్ల ఫిక్సింగు

స్కూలు ఫీజు పెంచడానికి రులు గట్రా లేవని  
మరో స్కూలు కి పంపిస్తే 
సర్కారు ఎవ్వడని ప్రైవేటు స్కూల్స్ ఫీజు  ఫిక్సింగు

I T పుణ్యామా అని  సాఫ్ట్వేర్  ఇంజనీరింగ్ చేస్తె 
ముందు  NO Vacancy అంట,Back door Entry అంట 
HR  నుండి   Agency వరకు అంతా మ్యాచ్ ఫిక్సింగు

ఒక పార్టీ సిద్ధాంతాలునచ్చక మరొక పార్టీకి ఓటేస్తే 
మెజారిటీ కరువైందని ఒకరకం ఫిక్సింగు

జీవితమే ఆటని 
ఆటనే స్ఫూర్తి అని 
ఎన్ని సార్లు ఓడిన 
ప్రయత్నమే ఉండాలని,నేర్చుకున్న  ఆటకూడ
బ్రస్టు పట్టించె
ఈ మ్యాచ్ ఫిక్సింగు

పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు 
ఫిక్సింగులె  ఫిక్సింగులు

Tuesday, 4 June 2013

ఎం చేద్దాం ?

గల్లీ గల్లీల్లో  సిల్లీ సిల్లీ వార్తలు  సేకరించి 
లొల్లి లొల్లి చేసే  టీవీ చానల్లు 

కల్ల -బొల్లి మాటలతో ఏమ్మర్చే నేతలని 
కుళ్ళి కుళ్ళి దిగజారిన రాజకీయ వ్యవస్థని 
కుల్ల బొడిచే దమ్మున్నా 

దలారీ తనమెందుకు ?

సొల్లు గాళ్ళ సోంబేరి గాళ్ళ ఇంటర్వ్యూ లు మాని 

స్వంతంగా ఎదిగిన,వ్యాపార సామ్రాజ్యాన్నేస్తాపించిన
నలుగురికీ ఉపయోగపడిన వ్యక్తులనైనగూర్చి
స్ఫూర్తి దాయక ఏమైనా చేయన్డిక 

సమయానికి తగు విలువ 
వ్యాపార ప్రకటనలతో నువు కొలవగ 

సరదాకని టీవీ చూసి చూసి 
సన్నాసులె అవుతున్నారిక్కడ