Sunday, 23 December 2012

Democracy

ఆధునిక యుగంలో ఆయుధం పట్టామంటే 
కత్తులు దూసామంటే ,తుపాకులు పేల్చామంటే 
బాంబులు వేసామంటే,భయబ్రాంతులు చేశామంటే 
అనాగరికపు చర్యరా 
తీవ్రంగా ఖండించరా 

మరే 

కలం కదం తొక్కితే,కవితలే మేమల్లితే 
వ్యంగ్యంతో వ్యాసాలే,కార్టూన్లే మేమేస్తే 
అబ్యంతరము మీరు చెప్పి,అరెస్ట్ లే   చేస్తే 
భావము ప్రకటించారాని పరిస్థితులే కల్పిస్తే 

ఎవరితో చెప్పమంటారు, ఆవేదనని 
ఎలా వ్యక్తపరచమన్తారు మనోభావాలని 

సామాన్య మానవుడు,సమస్య కాదేప్పుడు
పాలించ వాళ్ళను కోరి,పట్టించుకోక పోతే 
వాళ్ళిచ్చిన సుంకంతో ప్రబుత్వాలే నడిచినప్పుడు 
వాళ్ళిచ్చిన వొటుతో అందెలే మీరేక్కినప్పుడు 

వారి బాధ వారి యెద పట్టదా ?

మీటింగ్ లని చెప్పి మీరు  పట్టుకొచ్చే కిరాయి జననాలు 
మీరు పిలవకుండానే వచ్చి మిమ్ములను నిలదీసే ప్రజలు 
ఎవరండీ  నిజమైన ఓటరులు 

రాబోయే కాలం చెపుతుంది గుణపాటం 
Of the People,By the People,For the People
అనే కదా నిజమైన Democracy
తూట్లు పోడిచారంటే దానికి మీరు నిలువెల్లా మసి 

No comments:

Post a Comment