ఉదయించాను నేను సూర్యునివలె
మెల్లగా మెల మెల్లగా
కష్టాల కొండల్లోంచి
ఎర్రని మందారంలా
ఉడుకు రక్తం నాలో ఉరకలేస్తుంటే
ఆవేదన నేను ఆపుకునేదేలా
వేడిగా పొగ సెగలతో నేను చెలరేగి పోతుంటే
చల్లగ ప్రేమను కురుపించేదేలా
నాలో నేను దాహిస్తున్నాను కాని
అసహ్యించుకునేంత తప్పు చేయలేదీ ప్రపంచం
ప్రకృతి నియమాన ఎదిరించినదే జీవితం
దెబ్బతిన్న నాకేంటి ఉందిగా ఇంకా విశ్వాసం
ఈ రోజు ఇలాగే చల్లారి అస్తమించినా
ఉదయిస్తాను కొత్త వెలుగుతో మరో ఉషోదయాన
కురుపిస్తా వెచ్చని ప్రేమని
వెలిగిస్తా ప్రతి జీవితాల్లో ఓ జ్యోతిని
No comments:
Post a Comment