ఉద్రేకం ఉక్రోషం వచ్చేనమ్మా
ఆక్రోశం ఆవేదన కలిగేనమ్మా
ఎక్కడున్దమ్మ ఆ స్వేచ్చా స్వాతంత్రం
మన ఇంట్లో మనకే ఈ సజీవ దహనం
కన్నవారి కలలన్నీ కట్టేల్లో కాలె
కన్నపేగు కళ్ళముందు మలమల మాడే
నీ తోటి జీవులను నివ్వురపరిచెనే
మానవతా విలువలను మంటల్లో కలిపెనే //ఉద్రేకం//
తన వాళ్ళను కాపాడి పరులను తూలనాడి
ఊచకొత కోసారె మానాలు తీసారె
రేపెప్పుడో ఈ గతి మీ వారికి పడితె
నీ తమ్ముని నీ తండ్రిని నిలువెల్లా నరికితె
నీ అక్కను నీ అమ్మను నిస్సహాయులను చేస్తే
తట్టుకోగాలవా ఓ సోదరా
హే అల్లా హే భగవాన్
అని గొంత్తెత్తి అరచినా
భందీలు వాళ్ళు కూడ
మంధిర్ మస్జిద్ లోన
రాబోరు ఎవ్వరూ నీ తోడు ఎప్పుడూ
నీతి -న్యాయాలను దగా చేసి
నర జాతికే మాయని మచ్చని తెచ్చిన వాన్ని
నామరుపము లేకుండా చేయాలిరా
మచ్చ పడ్డ మానవతా విలువలను సరిచేయాలిరా
వదలరా కులం-మతం మత్తుని కుదిపెయరా
స్వలాభానికి నీ ఇంట్లో చిచ్చు పెట్టిన రాక్షసుణ్ణి సంహరించారా
కదలరా కదలరా కదలరా .........
हिंसा का समाधान अहिंसा नहीं तो
हिंसा ही सहि
हर हाल में इंसानियत को बचाना है
No comments:
Post a Comment