ఎక్కడెక్కడని వెతికిన నన్ను
అక్కడక్కడ అగుపించును నేను
బరువెక్కిన నీ భావంలోన
కరిగి రాలు నీ కన్నిటిలోన
అట్టడిగిన నీ ఆవేధనలోన
అంతమొందిన నీ ఆవేశంలోన
// ఎక్కడెక్కడని //
భరింపరాని నీ కష్టంలోన
చివ్వున చిందిన నీ రక్తంలోన
చినుకై రాలిన నీ చెమటలోన
రాజీ పడిన నీ బ్రతుకులోన
రాజీకి రాణి నీ మనసులోన
భాదే మోసే నీ హృదయంలోన
// ఎక్కడెక్కడని //
హృదయపు తావు అఘాదంలోన
అహం నిండిన కొండలోన
గళ గళ పారే సెలయేటిలోన
మృదు మధురమైన నీ మాట లోన
చిరు జల్లై కురిసే నీ పాటలోన
// ఎక్కడెక్కడని //
No comments:
Post a Comment