సోమరితనం కాదురా
సొమ్మసిల్లి పడి ఉన్నాడు
అనామకుడు కాదురా
ఆకలిగొన్న వాడు
బికారీ కాదురా
బీదతనం ఆవహించిన వాడు
మండుతున్న ఎండలో
తానూ మండుతూ
కురుయుచున్న వర్షంలో
తానూ తడుస్తూ
కుడూ గూడూ లేక
నా అన్న వాల్లసలే లేక
జనంతోటి నిండి ఉన్న
ఈ జనారణ్యంలో
గాలికి విసిరి వేయబడ్డ
ఎండుటాకులా పడి ఉన్నాడు
No comments:
Post a Comment