Monday, 19 November 2012

నే సాయ పడలేను....... ప్రకృతి

కుళ్ళి పోయిన సమాజానికి 
నే సాయ పడలేను అని 
ఎదురు తిరిగిన ప్రకృతికి 
ఏమని సమాధానము  చెప్పను 

నీ ధాటికి ఎగిరిపోయిన 
ఈ గుడిసెలను చూపనా 
నీటిలో కొట్టుకు పోయిన 
ఆ జీవులను చూపనా 

అధికార మదంతో అందలెక్కి  కూర్చున్న 
ఆ ప్రభుత్వాల కేమి తెలుసు ఈ జీవుల బ్రతుకులు 

కరునించవా  ఈ పేద ప్రజలను చూచి 
ఆపుము నీ ప్రళయ తాండవము 
చేయుము ఈ జీవులకు సాయము 

No comments:

Post a Comment