Wednesday, 20 March 2013

ఓటు తిరస్కార హక్కు(Right to Reject)

రాజకీయపు  చెదలు  తొలుగు 
రాజ్యాంగంలో  వస్తె మార్పు 
ఎన్నుకునే  హక్కు ఉన్న మనకి 
ఎదురించేందుకు  లేదెందుకని 

పోటీలో ఉన్న అబ్యర్ధులు 
ఓటుకి  అర్హులు కానప్పుడు 
గుడ్డిలో మెల్ల వెతికే 
కర్మ మనకెందుకు 

అబ్యర్దులను  తిరస్కరించె 
అధికారం కావాలి 
కొత్త అభ్యర్దులను అడిగె 
పరిస్తితియె  ఉండాలి 

ఏ పార్టీ అయితేనేమి 
ఏమార్చటానికి 
చిత్తశుద్ది ఉన్నదెవరొ 
వివరంగా తెలియాలి 

ఆత్మ శోధన  అన్నీ పార్టీలకు అవసరం 
లేకుంటే తొందరలో పార్టీలు నిర్జీవమ్ 

Saturday, 9 March 2013

వోటు......నువ్వెటు?

విద్యార్హత కల్పిస్తే విలువ మీకు దక్కేను 
పని అవకాశం కల్పిస్తే ప్రచార ఖర్చు మిగిలేను 

కష్టించిన ప్రతి ఒక్కడి కష్ట ఫలి మిగిల్చ గలిగితే 
ప్రతి ఒక్కడికి అవకాశం వాడి అర్హత తీరు కల్పిస్తే 

సబ్సిడీల కోసం ఆర్రులు చాచే పరిస్థితి ఉండదురా 
సంక నాకి పోయే సన్నాసులు మిగలరురా 

వచేస్తున్నాయ్ ఎలక్షన్లు వడి వడిగా వేగంగా 
కుస్థీలకు పార్టీలు అవుతునాయ్ సిద్ధంగా 

అరకొర కోరికలకు అర్రులు చార్చకుండ
ఆలోచించి వేయండి వోటు మీరు ఇకనైనా 

ఆరుపదులు దాటింది స్వాతంత్రం వచ్చి మనకి 
అద్దంలో మొహం చూసుకో,పరిస్థితి నీది మారిందా 

నిజాయితీకి నీల్లోదిలేసారన్నావు 
కుంభ కోణాలు ఎంతేక్కువైతే అంత రికార్డులె అన్నావు 
రౌడీ  రాజ్యం ఎలుతున్దన్నావు 
ధరలకు రెక్కలోచ్చాయన్నావు 
రైతులకేమో ధరలే లేవన్నావు 
అన్ని పెరిగిపాయె జీతం తప్ప అన్నావు 

వోటుకి  నోటుకి లింకు పెట్టకుండ
సారాకి బ్రాదీలకు లొంగకుండ 
చీరె రవికలకు ఆశపడక 

వోటు తో చరిచి  ఈ రాజకీయ వ్యవస్థని 
అప్పుడు....
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని సమాజాన్ని 
మారదు  లోకం నువ్వు అనమాక 
మారుతుంది లోకం నువ్వు మారక 
మార్పు కోసం తనవంతు చేసాక