Thursday 29 November 2012

శాంతి

మనిషీ  ఓ మనిషీ 
పదవోయి ముందుకు 
సాగవోయి మునుముందుకు 

మర్యాద అనే రహదారిలో 
నాలుగు చక్రాలున్న బండిలాగా 
జ్ఞాన్ ,యోగ,ధర్మ ,సేవ చేస్తూ 
సాగవోయి ఆ  దారిలో 

స్వచ్చంగా ఉంది 
సత్యాన్ని పలుకుతూ 
న్యాయంగా నిలబడి 
ఫలము,నీడ ఇచ్చే చెట్టులాగ 
జ్ఞానాన్ని పంచుతూ 
నీతిని బోదిస్తూ 
సత్యాన్ని సూచిస్తూ 
సాగవోయి మునుముందుకు 

సత్యం,శాంతి ఎక్కడున్నాయని
 నీవు సిద్ధార్తుడిలా 
అన్వేషణకు పోకోయి 

నీ చుట్టూ నెలకొల్పుకోయి 
ప్రశాంతిని 
అప్పుడు
నీకే తెలుస్తుంది
 శాంతి ఎక్కడో లేదు 
నీవు ప్రశాంతంగా ఉంటే 
శాంతి నీ చెంతనే  ఉన్నదని 

No comments:

Post a Comment