Sunday, 18 August 2013

జై కిసాన్

నిత్యావసర వస్తువుల ధరలు
ఆకాశానికి ఎగబాకుతుంటే
హహాకారేలే చేస్తున్నాం

అదే

నిత్యావసర వస్తువుల ధరలు
అధపాతానికి కుంగిపోతుంటే
రైతన్న పరిస్థితి
ఏనాడైనా తలచామా

సమీక్షలు సదస్సులూ
ఉద్యమాలు ఊరేగింపులూ
ఏమీ చేత కాక
ఎవ్వరూ రైతన్న తోడు రాక

ఆర్థిక పరిస్థితికి కుంగిపోయి
ఆత్మహత్యలే వారు చేయగ
ఎనాడైనా వారిని పట్టించుకున్నమా

ధరలు రెట్టిమ్పైనా
రోడ్డున పడవెవరీ బ్రతుకులు

ధరలు కుంగినప్పుడు
రైతన్నకుటుంబానికి  లేవు తిండి  మెతుకులు

జై కిసాన్ జై జవాన్
అంటున్నాం ఎప్పటినుండో
జవాన్ కి కావలసిన ప్రాత్సాహం
ఇవ్వాల్సిన శిక్షణ
కూర్చాల్సిన రక్షణ

లేదెందుకు  కిసాన్ కి

స్ఫూర్తి దాయక  రక్షణ వ్యవస్థకి
దూరమైతె  రక్షకుడు
బ్రతకడమే  బరువై
వ్యవసాయాన్నే  విడనాడితే రైతు

ధర్మో రక్షతి చెసే వాడేవ్వడురా
ఆకలైతే  అన్నం పెట్టే వాడెవ్వడురా