Thursday 16 October 2014

ప్రకృతి విలయ తాండవం

ఎపుడు వచ్చును ప్రళయం
ఎపుడు వచ్చును విద్వంసం
సాంకేతిక పరిజ్ఞానంతొ  కనుగొను మనం

భూమాత ఎదను తవ్వి
అపార సమపదనే  తోడుకొని 
అభివృద్ధి పేరు చెప్పి
సమతల బావమే విడనాడి
చేసిన పనులకు మనది  బాద్యత కాదా 

అంతరిక్షములకు  ఎగబాకి
అన్నిటిని గమనించి చూసి
అర్డంబు చేసుకొని
బాధ్యతగా మెదలడం అవసరం లేదా 

సాంకేతిక అబివ్రుద్దిని తోడి
సామాన్య పరిజ్ఞానము వీడనాడి
మానవతా విలువలు మాని
సంపదతో కొలచి వలచి 

ప్రక్రుతికే  పరీక్షలు పెడితే
ప్రకృతి వికృతి కాదా 

అవసరాన్ని  వాడుకొని
వ్యాపార మూల సూత్రం  విడనాడి
రాబందుల వాలే ప్రవర్తించు వారు
మనలో ఒకరే అని మరిచారా


సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న  మన అభివృద్ధి అహంకారం
మనకేం కాలేదులే అనుకున్న మానవుడి విచక్షణ జ్ఞానం
పటాపంచలు చేసే ప్రకృతి విలయ తాండవం
తనదాకా వస్తే కానీ అర్ధం కాదు కదా

అర్ధం చేసుకు బ్రతికితే అది మన సంస్కారం

లేకున్నా ఈదక  తప్పదు ఈ దుఃఖసాగరం