Wednesday, 7 November 2012

నగర జీవితం

పొగ మబ్బుల  పందిరి క్రింద 
అందంగా  కదులుతున్న వయ్యరిలా 
సాగుతుంది ఈ నగర జీవితం 

సిరులోలికే  ప్రదేశాలు సింగారించు కున్నట్టుగా 
(ము)మరిపించి మనసు దోచుకునే  ఎన్నెన్నో  ప్రదేశాలు 
చూచే వాడి కోనం నుంచి చూడ తగినన్ని అందాలు 

అలాగని ....

చూడ కుండ ఉండలేము ఈ నగర ముఖ భావాలు 

అవసరం తీరాక వదిలేసిన వేశ్యలా 
కుములుతూ  కములుతున్న మరెన్నో ప్రదేశాలు 

అందమైన మలుపుల్లో  అగుపించే వైభావాలే  కాక 
అందకారపు  కోనల్లో కానరాని (స్పష్టంగా) జీవితాలు 

కన్నులు తెరువలేని కాలి కడుపుల బ్రతుకులు 
జానెడు గుడ్డకై  జావగారిన పరిస్తితులు 

పై పై అందాలకు మెరుగులు దిద్దుతూ 
నిస్పృహ  కదలికలను అందంగా పొగుడుతూ 
ఆనందిస్తున్న  ఈ  మనుషులతో 
నిస్తేజంగా సాగుతుంది  ఈ మహా నగర జీవితం 

No comments:

Post a Comment