Tuesday 13 November 2012

ఓ మిత్రమా

ఉషోదయాన వెలుగునై  వస్తాను 
పరిమళాల  జల్లునై  కురుస్తాను 
రంగుల రంగొలినై  అలరిస్తాను 
నీ వాకిట ముగ్గునై  నిలుస్తాను 

పెరటిలోని  కోయిలనై  పలుకరిస్తాను 
పెదాలు దాటని పలుకునయ్యి పరవశిస్తాను 
పరుగెట్టే  ఉడతనై  కనువిందు చేస్తాను 
నీ పూతోటన  మరుమల్లేలే  మొలకిస్తాను 

సంధ్యా సాయంత్రాన  చల్లగాలినై  వీస్తాను 
పక్షుల  కిలకిలతోటి కబురులేన్నో వినిపిస్తాను 
ఆకాశంలో పక్షినై  విన్యాసములతో కనువిందు చేస్తాను 
అదో వింత అనుభుతినై  నీ మది  నిండుతాను 

వెన్నెల్లో చంద్రుడినై  ఆహ్లాద  పరుస్తాను 
తలపుల్లో  చుక్కనై  మెరుస్తాను 
వెచ్చని  స్పర్శనై  నీ తోడు ఉంటాను 
నీ కంటిపాపలో  నిదురనై  జో కొడతాను 

నీ కేందుకు  భయమే బాల 
చెంతన నేనుండగా  ఏల

అభయ హస్తమిది
 స్నేహ బంధమిది
ఏనాటి  బంధమైనా 
పవిత్ర సంబంధమే  ఇది 
నిలుపుకోనా నిను నేస్తమా 
చిరకాలం  ఓ మిత్రమా.........

No comments:

Post a Comment